: పసుపు చీర కట్టుకున్న విజయవాడ - గుంటూరు
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. నాగార్జున యూనివర్సిటీ ఎదుట మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీంతో ఇటు విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి అటు గుంటూరు నగరం వరకు 30 కిలోమీటర్ల మేర రహదారి అంతా పసుపు చీరకట్టుకున్నట్లుగా ఉంది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. భారీ కటౌట్లు, స్వాగత ద్వారాలను కూడా ఏర్పాటు చేశారు. రాత్రి 7.27గంటలకు కార్యక్రమం ఉండడంతో పెద్ద ఎత్తున లైటింగ్ ను అమర్చారు