: కనకదుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్
గవర్నర్ నరసింహన్ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఈ ఉదయం గవర్నర్ విజయవాడ చేరుకున్నారు. ముందుగా అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు.