: ఇరవయ్యేళ్లలోగా అంగారకుడిపై కాలనీ
రెండు దశాబ్దాల్లోగా అంగారక గ్రహంపై ఒక కాలనీ కట్టేసి, అందులో మానవ నివాసాల్ని ప్రారంభించాలని ఉన్నదట. ఈ కల కంటున్నది పిల్లల ఫిక్షన్ పుస్తకాలు రాసే ప్రముఖులు కాదు. చంద్రుడిమీద నడిచిన రెండో వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్. అంగారకుడిపై నివాస ఏర్పాట్లు చేయాలని ఉన్నట్లుగా ఆయన తన తాజా పుస్తకంలో వెల్లడించారు.
పిల్లల్లో అంతరిక్ష శాస్త్రంపై మరింత మక్కువ పెంచే ప్రయత్నం కూడా జరగాలని ఆయన అనుకుంటున్నారు. ఆయన తాజా పుస్తకం 'మిషన్ టూ మార్స్'లో సకలం.. అంగారక గ్రహ యానానికి సంబంధించిన వివరాలే ఉన్నాయిట. భవిష్యత్తులో కమర్షియల్ అంతరిక్ష యాత్రలు పెరుగుతాయని ఆయన అంచనా వేస్తున్నారు.