: మినహాయింపులు లేని వ్యవసాయ రుణమాఫీ కావాలి: శ్రీకాంత్ రెడ్డి
మినహాయింపులు లేని వ్యవసాయ రుణమాఫీ కావాలని వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కొత్త రాజధాని కోసం నిధులు కోరుతూ, మరోపక్క ప్రమాణ స్వీకారం అర్భాటంగా నిర్వహించడం సరికాదని హితవు పలికారు. ప్రమాణ స్వీకార బహిరంగ సభ కోసం పేదల ఇళ్లు కూల్చడం ఎతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తున్నట్టు స్పష్టతనిస్తూ తొలి సంతకం చేయాలని ఆయన సూచించారు. ఈ విషయంపై టీడీపీ నేతలు స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.