: ఈ ఐస్ వెంటనే కరిగిపోదు... 'కాస్ట్ లీ' కూడా!
మందులో ఐస్ క్యూబ్స్ వేసుకుంటే వచ్చే మజా అంతా ఇంతా కాదంటారు మందుబాబులు. ఇలాంటి వారి కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన గ్లేస్ లగ్జరీ ఐస్ కంపెనీ కొత్తరకం 'ఐస్ క్యూబ్స్' తయారు చేసింది. ఇవి కచ్చితమైన చతురస్రాకారంలో చూడముచ్చటగా ఉంటాయి. షేప్ లో ఇసుమంతైనా తేడా రాదు.
ఈ ఐస్ ముక్క పత్యేకత ఏంటంటే, దీనిని డ్రింక్ లో వేసిన వెంటనే డ్రింక్ ను చల్లార్చడమే కాకుండా, 40 నిమిషాల పాటు అది కరగకుండా ఉంటుంది. ఈ ఐస్ కి ఎటువంటి రుచి వుండదు. అందువల్ల డ్రింక్ రుచి మారదు. కానీ, దీని రేటు మాత్రం కళ్లు బైర్లు కమ్మేదే. ఐస్ క్యూబ్ బ్యాగ్ ఒకదాని ధర 20 వేల రూపాయలు... 'కాస్ట్ లీ' మందు తాగే 'బాబు'లకు అదో లెక్కా? అంటారా ... సరే కానీయండి!