: వీర్యదాతా సుఖీభవ!
పిల్లల్లేని దంపతుల విషయంలో.. గుర్తు తెలియని వీర్యదాతలకు ఎంతో విలువ ఉంటుంది. సదరు వ్యక్తి.. వీర్యదాతగా సమాజంలో పొక్కిపోతే.. అతనికి సామాజికంగా భిన్నమైన అభిప్రాయాలు కూడా ఎదురవుతూ ఉండవచ్చు గాక.. కానీ, బ్రిటన్‌లో మాత్రం ఇలాంటి వీర్యదాతల పట్ల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ఓ సినిమా ఈ కాన్సెప్టు మీద రూపొందడంతో ఆ సినిమా టైటిల్‌తోనే ఆ దేశంలో ఇలాంటి వీర్యదాతలను డెలివరీ మ్యాన్‌లుగా అభివర్ణిస్తూ ఉంటారు.
పైగా బ్రిటన్‌లో సంతాన సాఫల్యత కోసం గుర్తు తెలియని ఇతరుల నుంచి వీర్యదానం తీసుకోవడం అనేది చట్టబద్ధం. ఈ చట్టం వచ్చాక, లండన్‌లో హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ సంస్థ 500 మందిని ఎంచుకుని వారితో ప్రయోగాలు చేసింది. వీరిలో ఒక్కొక్కరు కనీసం పది మంది ఆరోగ్యవంతమైన శిశువుల జన్మకు కారకులయ్యారట. ప్రస్తుతం లండన్‌లో ఏటా 2000 మంది పిల్లలు ఇలా వీర్యదానం ద్వారా పుడుతున్నారు.