: జూబ్లీహిల్స్ ఘటనలో నిందితుడిపై నిర్భయ కేసు నమోదు


హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఓ మెడికల్ స్టూడెంట్ పై అత్యాచార యత్నం చేసిన నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేశామని హైదరాబాదు పోలీసులు చెప్పారు. నిందితుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాడని, అతనిపై నిర్భయ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్లు 354, 376, 448 కింద అభియోగాలు నమోదు చేసినట్లు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. పీజీ మెడికల్ టెస్ట్ కోసం ప్రిపేరవుతున్న వైద్య విద్యార్థిని గత కొద్దిరోజులుగా ఒక గెస్ట్ హౌస్ లో ఉంటోందని, అక్కడే పనిచేస్తున్న నిందితుడు అదను చూసి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడన్నారు. ఈ ఘటనలో ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో అతను పరారయ్యాడని డీసీపీ చెప్పారు. స్థానికులు 100 నెంబరుకు డయల్ చేసిన కొద్ది నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని పట్టుకున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News