: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి గుంటూరు ముస్తాబవుతోంది


నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి గుంటూరు ముస్తాబవుతోంది. సువిశాల మైదానంలో ప్రమాణ స్వీకారాన్ని వేలాది మంది వీక్షించే విధంగా వేదికను సిద్ధం చేస్తున్నారు. ఎండ వేడిమి తగలకుండా వేదిక, వీవీఐపీ గ్యాలరీలో గ్రీన్ హౌస్ ను ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం అక్కడ శీతలీకరణ యంత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి ఏర్పాట్లను చంద్రబాబు తనయుడు లోకేష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భారీ ప్రదేశం కావడంతో ఇంకా షెడ్ల నిర్మాణం కొనసాగుతోంది. మొత్తం ఇవాళ రాత్రికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరవుతుండటంతో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.

  • Loading...

More Telugu News