: విభజన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ కు మంచిదే: రఘువీరా


విభజన పరిణామాలతో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆర్భాటంగా ఏర్పాట్లు చేయడాన్ని ఆయన సమర్థించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదని తెలిపిన రఘువీరా... ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు సహా మంత్రివర్గ సభ్యులకు అబినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News