: హైదరాబాదులో ప్రభుత్వ గుర్తింపు లేని స్కూళ్ల మూసివేత
హైదరాబాదులో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలపై విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. నగరంలో ఇప్పటికే ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు మొత్తం 118 ఉన్నట్లు గుర్తించారు. ఈ స్కూళ్లు మూసివేయాలని విద్యాశాఖ ఆయా పాఠశాలల యజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లో చేర్చాలని కూడా ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ముందు హైదరాబాదులో గుర్తింపు లేని పాఠశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, ప్రతి ఏటా కొత్త పాఠశాలలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.