: నీలా లక్ష కోట్లు దండుకోవడం లేదు... రుణ మాఫీ చేస్తున్నాం: జగన్ కు సోమిరెడ్డి కౌంటర్


వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానంటే అంత అక్కసు ఎందుకు? అంటూ ప్రశ్నించారు. బాబు నీలా రాజప్రసాదాల కోసం లక్ష కోట్ల రూపాయలు దండుకోవడం లేదని, రుణమాఫీ చేస్తున్నారని ఆయన అన్నారు. రైతు రుణమాఫీలో షరతులు పెడితే ఆ డబ్బు కూడా వారి సంక్షేమానికే ఖర్చు పెడతారని ఆయన అన్నారు.

బాబు రైతు రుణమాఫీ చేయలేరంటూ అపశకునాలు పలకడం ఎంత వరకు సమంజసమని సోమిరెడ్డి నిలదీశారు. రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని జగన్ కు హితవు పలికారు. ఇప్పటికీ పార్టీ నుంచి అందరూ ఎగిరిపోతున్నారని, మిగిలిన నాయకులు వేరే పార్టీ మారకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.

చంచల్ గూడ జైలు నుంచి ర్యాలీకి ఎంత ఖర్చయిందో చెప్పు? అంటూ ఆయన లెక్క అడిగారు. బహిరంగ సభకు ఎంత ఖర్చవుతుందో తెలియని దుస్థితిలో జగన్ ఉన్నారని ఆయన మండిపడ్డారు. 'కాబోయే ముఖ్యమంత్రి రమ్మని స్వయంగా ఆహ్వానిస్తే, రానని చెప్పడం నీ సంస్కారానికి నిదర్శనం' అని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News