: ఉత్తరప్రదేశ్ లో మరో అరాచకం
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. లలిత్ పూర్ సమీపంలోని బన్ పూర్ లో రామ్ సహాయ్ (22)కి తన వదిన సరోజ్ (24) తో వివాదం చోటుచేసుకుంది. దీంతో అతడు ఆమెపై గొడ్డలితో దాడి చేశాడు. గొడ్డలితో నరకడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తక్షణం ఆమెను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ఝాన్సీకి తరలించారు. దీంతో తీవ్రంగా భయపడిపోయిన రామ్ సహాయ్ ఏదో విషపదార్థాన్ని తాగేశాడు. ఆ విషయాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు తెలిపాడు. దాంతో వారు అతనిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేయిస్తుండగా అతను మృతి చెందాడు.