: కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది... ఆ స్థానం మనం ఆక్రమిద్దాం: వెంకయ్యనాయుడు


"ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇచ్చారు. అది నెరవేరుస్తాం. అది పదేళ్లు కూడా కావొచ్చు" అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానం ఖాళీ అయిపోయిందని, కష్టపడి ఆ స్థానాన్ని ఆక్రమించాలని కార్యకర్తలకు సూచించారు. టీడీపీ తరువాతి స్థానంలో బీజేపీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శక్తి వంచన లేకుండా కృషి చేస్తే అది పెద్ద కష్టం కాదని ఆయన అన్నారు.

కాళ్లకు నమస్కారం పెట్టడం సంస్కారం కాదని, చేతులు జోడించి నమస్కరించడం సంస్కారమని ఆయన తెలిపారు. 'నా కాళ్లకు నమస్కరిస్తే పంచె పట్టుకోవాలి, వారిని లేపాలి, ఇది కాస్త కష్టం' అని ఆయన చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు విరబూశాయి.

  • Loading...

More Telugu News