: పరారీలో ఉన్న సినీ నటుడు అరెస్టు
వెండి తెరపై సహాయ నటుడిగా పలు పాత్రల్లో ప్రేక్షకులను అలరించాడు. మూడు సినిమాల్లో పోలీస్ అధికారిగా కూడా నటించాడు. నిజజీవితంలో అతను దొంగ. 14 ఏళ్ల క్రితం 22 మోటార్ సైకిళ్లను తస్కరించిన కన్నడ నటుడు నరసింహమూర్తి అలియాస్ మూర్తి (44) గతంలో జైలు పాలయ్యాడు. రెండేళ్లు శిక్ష అనుభవించిన తరువాత మూర్తికి బెయిల్ మంజూరైంది. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత పరారయ్యాడు. 2004 నుంచి పరారీలో ఉన్న మూర్తిని పోలీసులు బెంగళూరులోని హెసరుఘట్ట సమీపంలోని విధాన సౌధ లేఔట్ లో అరెస్టు చేశారు.