: 17 లక్షల వాచీ 100 రూపాయలే!


వారంతా పిల్లదొంగలు. కొట్టేయడం తెలుసు కానీ, ఆ వస్తువుల విలువ గురించి వారికి తెలియదు. దాంతో వారి దగ్గర వస్తువులను చవగ్గా కొనుక్కున్న వారి పంట పండింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో, గోమతి నగర్ లో ఇటీవల కాంగ్రెస్ నేత పీయూష్ మిశ్రా ఇంట్లో పిల్ల దొంగలు (12 నుంచి 15 ఏళ్ల లోపు వారు) పడ్డారు. చేతికి దొరికిన వస్తువులన్నీ పట్టుకుని పోయారు. అందులో 17 లక్షల రూపాయల విలువ జేసే రోలెక్స్ వాచీ కూడా ఉంది. దాన్ని ఓ పాన్ వాలాకు 100 రూపాయలకే అమ్మేశారు.

మరో ఘటనలో 12 లక్షల రూపాయల విలువజేసే వాచీని కూడా కొట్టేశారు. చివరికి ఓ ఇంట్లో చొరబడుతుండగా విజయ్ సింగ్ అనే స్థానికుడు పిల్లదొంగలను పట్టేసుకున్నారు. వారంతా 12 నుంచి 15 ఏళ్లలోపు వారని, బడీజుగౌలి ప్రాంతానికి చెందిన వీరు తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News