: అక్కాచెల్లెళ్లను అడవికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం
పది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లో అక్కాచెల్లెళ్లను అత్యాచారం చేసి ఉరి తీసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనానికి దారితీయగా... అదే రాష్ట్రంలో మరో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృగాళ్ల చేతిలో అన్యాయానికి గురయ్యారు. బదౌన్ కు 85 కిలోమీటర్ల దూరంలోని, ఇతాజిల్లా శివాపూర్ గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్లు (14 నుంచి 15 ఏళ్ల వయసు వారు) శుక్రవారం పిండిమిల్లుకు వెళుతుండగా ముగ్గురు దుండగులు వచ్చి అపహరించుకుపోయారు. వారిని ఓ అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. బాధిత బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల్లో బాలికలపై అత్యాచారం జరిగినట్లు తేలింది. ఉత్తరప్రదేశ్ లో అరాచకశక్తులు ఎంతగా చెలరేగిపోతున్నాయో ఈ వరుస ఘటనలు తెలియజేస్తున్నాయి.