: టీడీపీలో చేరిన మరో వైఎస్సార్సీపీ నేత
కర్నూలు జిల్లాలో మరో వైకాపా నేత సైకిలెక్కారు. పత్తికొండ నియోజకవర్గ వైకాపా ఇన్ ఛార్జ్ కోట్ల హరిచక్రపాణి తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబుతోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యమని... అందుకే తాను పార్టీని వీడుతున్నానని స్పష్టం చేశారు. చక్రపాణి రాజీనామా కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.