: నీ భార్యను చంపావా...? చంపుతున్నావా...?
రెండోసారి ఆడ శిశువుకు జన్మనిచ్చినందుకు ఓ మహిళ తన భర్త చేతిలో అన్యాయంగా బలైపోయింది. కరడుగట్టిన ఉన్మాది పోలీసులకు ఫోన్ చేసి మరీ తన భార్యను హతమార్చాడు. కానీ, పోలీసులు మాత్రం ఆమెను రక్షించే ప్రయత్నం చేయలేదు. టర్కీలోని దియార్ బకీర్ ప్రావిన్స్ లో ఇది జరిగింది. ఆమె నిద్రిస్తుండగా విద్యుత్ షాక్ ఇచ్చి మరీ క్రూరంగా చంపాడు. ఇది ఈ ఏడాది జనవరిలో జరగ్గా తాజాగా కోర్టులో విచారణ జరిగింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఆమె బతికి ఉండేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిందితుడు హత్య సమయంలో పోలీసులతో జరిపిన సంభాషణ ఇలా ఉంది.
నిందితుడు: నేను ఒకరిని చంపా పోలీసు: ఎవరిని చంపావు? నిందితుడు: ఇప్పుడు నా భార్యను చంపుతున్నాను పోలీసు: నీ భార్యను చంపావా? లేక చంపుతున్నావా? నిందితుడు: ఆమె ఇంకా చావలేదు. చంపుతున్నాను. మరణం అంచుల్లో ఉంది. పోలీసు: సరే కాస్త ఆగు. పోలీసు బృందం వస్తుంది