: అబ్బురపరిచిన ఐష్.. కత్రినా ప్రదర్శన..!
టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్ లో ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ ల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వీరిరువురూ చేసిన డ్యాన్స్ కు ప్రాంగణమంతా మారుమోగిపోయింది. మరో వైపు మోకాలి గాయంతో బాధపడుతున్నా షారూఖ్ ఖాన్ అద్భుతంగా డ్యాన్స్ చేసి ఫంక్షన్ కు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు.
రాత్రి ముంబయ్ లో కళ్లుమిరిమిట్లుగొలిపే రీతిన జరిగిన ఈ సినిమా అవార్డుల కార్యక్రమంలో తారలు సందడి చేశారు. ఇక, ఉత్తమ నటీనటులుగా 'బర్ఫీ' సినిమాలో అభినయానికి గాను ప్రియాంక చోప్రా, రణభీర్ కపూర్ ఎంపికవగా, ఈ సినిమాతోనే బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఇలియానా బెస్ట్ డెబ్యూ ఫిమేల్ అవార్డ్ చేజిక్కించుకున్నారు.