: ఈ రోజు టీటీడీఎల్పీ నేత ఎంపిక


తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతను ఈ రోజు ఎన్నుకోనున్నారు. నిన్న టీటీడీపీ సమావేశం జరిగినప్పటికీ... టీటీడీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకే వదిలేశారు. దీంతో, ఈ రోజు శాసనసభాపక్ష నేతను చంద్రబాబు ఎంపిక చేయనున్నారు. ప్రధానంగా ఈ పదవికి ఎర్రబెల్లి, తలసాని, ఆర్.కృష్ణయ్యలు పోటీ పడుతున్నట్టు సమాచారం. అయితే, చంద్రబాబు ఎవరిని ఎంపిక చేసినా... ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని టీటీడీపీ నేతలు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News