: ఎంపీ 'మహిళా సహాయ సెంటర్' ను ప్రారంభించనున్న అమీర్ ఖాన్
మధ్యప్రదేశ్ లో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న మహిళా సహాయ సెంటర్ ను బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రారంభించనున్నారు. 'మేధా మహిళా సేవా కేంద్ర' పేరుతో నడపనున్న ఈ సెంటర్... వేధింపులకు గురవుతున్న పలువురు మహిళలకు వైద్య, న్యాయ, మానసిక సహాయాన్ని అందించనుంది. ఈ నెల 16నుంచి దీని సేవలు మొదలవుతాయి. ఇక తల్లి, బిడ్డ ఆరోగ్యం, టీకా, కుటుంబ సంక్షేమ కార్యక్రమం కోసం 'మమతా అభియాన్' పేరుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంక్షేమ కార్యక్రమానికి ప్రచారకర్తగా నటి మాధురీ దీక్షిత్ వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిపారు.