: శ్రీవారిని దర్శించుకున్న దిగ్విజయ్ సింగ్
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న డిగ్గీరాజాకు టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.