: పాతబస్తీలో నయీం అనుచరుడు యూసుఫ్ అరెస్ట్
టీఆర్ఎస్ నేత కోనపురి రాములు హత్యకేసులో నిందితుడైన మాజీ నక్సలైట్ నయీం అనుచరుడు యూసుఫ్ అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ పాతబస్తీలో మారణాయుధాలతో తిరుగుతున్న యూసుఫ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూసుఫ్ పై ఇప్పటికే పలు హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ నేరగాడిని భవానీ నగర్ పోలీస్ స్టేషనులో అప్పగించారు.