: కట్నం కోసం రెండో పెళ్లా... పద జైలుకు!
డబ్బు కోసం రెండో పెళ్లి చేసుకోబోతూ పోలీసులకు చిక్కాడో మనీ పెళ్లికొడుకు. హైదరాబాద్ లోని సనత్ నగర్ కు చెందిన రవిశంకర్ కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత నుంచి కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఎప్పటికప్పుడు ఆ ఇల్లాలు ఎంతో కొంత పట్టుకొస్తూనే ఉంది. మళ్లీ మళ్లీ డబ్బుల కోసం వేధిస్తూనే ఉన్నాడు. ఇక డబ్బుల్లేవని ఆమె చెప్పడంతో, కట్నం కోసం అతడు ఈ రోజు మరో వివాహం చేసుకోబోయాడు. ఆ విషయాన్ని ఆమె పోలీసులకు తెలియజేయడంతో వారు పెళ్లి జరిగే చోటుకు వెళ్లి అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.