: ఒక్క ఎస్ఎంఎస్ మైనర్ పెళ్లిని ఆపి... కలలను బతికించింది


ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే ఒక్క ఎస్ఎంఎస్ ఓ మైనర్ బాలిక పెళ్లిని ఆపి కలలను బతికించింది. చెన్నైలోని సుర్ బుర్బాన్ ప్రాంతంలో 17 ఏళ్ల మైనర్ బాలికకు జూన్ 8 పెళ్లి చేయాలని నిశ్చయించారు. అప్పుడే పెళ్లి వద్దని, ఇంకా చదువుకుంటానని ఎంత చెప్పినా ఆమె తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో ఆ బాలిక ఎస్ఎంఎస్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. రంగప్రవేశం చేసిన పోలీసులు బాలిక పెళ్లిని అడ్డుకుని, బాలల సంక్షేమ కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమె విద్యకు ఏ విధమయిన ఆటంకం కలగదని, ఆమె కలలు సాకారమవుతాయని తెలిపారు.

  • Loading...

More Telugu News