: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సమన్లు
పరువు నష్టం దావా కేసులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. తనపై స్మృతి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ కొన్ని రోజుల కిందట కోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన న్యాయస్థానం చర్యలు తీసుకుంది.