: శ్రీలంకను ముంచెత్తుతున్న వరదలు... లక్ష మంది తరలింపు
పొరుగు దేశం శ్రీలంకను వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే 23 మంది మృతి చెందారు. మరింత ప్రాణ నష్టం సంభవించకుండా ఉండేందుకు... సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.