: టీటీడీ ప్రాణదాన పథకానికి కోటి రూపాయల విరాళమిచ్చిన భక్తుడు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తున్న ప్రాణదాన పథకానికి బెంగళూరుకు చెందిన భక్తుడు సుధాకర్ కోటి రూపాయల విరాళాన్ని ఇచ్చారు. అలాగే, టీటీడీ అన్నదాన పథకానికి బెంగళూరుకు చెందిన మరో భక్తుడు భద్రారెడ్డి కోటి రూపాయల విరాళాన్ని అందించారు. దీనికి సంబంధించిన చెక్కులను వారు ఇవాళ టీటీడీ అధికారులకు అందించారు.