: భారత పర్యటనపై పాక్ పీఎం అంత సంతృప్తిగా లేరట!


ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజుల పాటు భారత్ లో ఉన్న షరీఫ్ మోడీతో స్నేహ పూర్వకంగా భేటీ అయి చర్చలు జరిపారు. కానీ, భారత పర్యటనపై ఆయన అంత ఆనందంగా లేరని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆ దేశ అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ సీనియర్ నేత చెప్పారు. ఈ మేరకు డాన్ న్యూస్ తో మాట్లాడుతూ, ప్రధానమంత్రులు మోడీ, షరీఫ్ కలసి సమావేశం ముగిసిన తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించని నేపథ్యంలో దాన్ని ఆయన చాలా అవమానకరంగా భావించారని పేర్కొన్నారు.

మీటింగ్ తర్వాత షరీఫ్ ఒక్కరే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, ఓ పేపర్ పై రాసుకొచ్చిన అసంపూర్తి సమాచారాన్ని ఆయన చదివి వినిపించారన్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా తన ఆదరణ పట్ల కూడా షరీఫ్ అంత సంతోషంగా లేరని ఆ సీనియర్ నేత వివరించారు. అయితే, పర్యటన సందర్భంగా జరిగినదంతా ఏదీ వ్యర్థంగా పోదన్నారు.

  • Loading...

More Telugu News