: నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించిన శశిథరూర్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ అందరినీ కలుపుకుపోతున్నారంటూ సీనియర్ కాంగ్రెస్ నేత అయిన థరూర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మోడీని ప్రశంసిస్తూ 'హఫింగ్ టన్ పోస్ట్' అనే అమెరికన్ వెబ్ సైట్ లో శశిథరూర్ రాసిన వ్యాసంలో ఈ అంశాలను ప్రస్తావించారు. దీనిలో మోడీ 1.0 వెర్షన్ నుంచి 2.0 వెర్షన్ కు అప్ గ్రేడ్ అయ్యారని సాఫ్ట్ వేర్ భాషలో చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంపై నేరుగా స్పందించలేదు. శశిథరూర్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమంటూ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. మొదటి దశలో కొన్ని వర్గాలకు మాత్రమే ప్రతినిధిగా ఉన్న మోడీ, ఇప్పుడు రెండో దశలో ప్రధానిగా అందరినీ కలుపుకుపోయేలా చర్యలు తీసుకుంటున్నారని థరూర్ ఆయనను ఆకాశానికెత్తేశారు.