: హామీలను నెరవేర్చకపోతే టీఆర్ఎస్ ను వదిలిపెట్టను: చంద్రబాబు
తాను ఎక్కడికీ వెళ్లనని... హైదరాబాదు నుంచే పాలన సాగిస్తానని ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తెచ్చేంతవరకు ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటిస్తున్నానని... ఇతర రాష్ట్రాలకూ విస్తరింపజేస్తానని చెప్పారు. కేవలం సెంటిమెంట్ తోనే టీఆర్ఎస్ గెలిచిందని... ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆ పార్టీని వదిలిపెట్టనని హెచ్చరించారు. టీఆర్ఎస్ రుణమాఫీ తీరును తెలంగాణ ప్రజలు గ్రహించారని... వారంతా ప్రస్తుతం టీడీపీ వైపు చూస్తున్నారని తెలిపారు.