: తీవ్రవాదులు, పోలీసుల మధ్య భీకర పోరు... ఎస్పీ మృతి


అసోంలోని కర్బీ అగ్లాంగ్ జిల్లాలోని రాంథాంగ్ అడవుల్లో తీవ్రవాదులు, పోలీసులకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఉగ్రవాదులు ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్పీ గోస్వామి తన సిబ్బందితో కలిసి వారిని పట్టుకునేందుకు వెళ్లారు. హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో గోస్వామి, అతని వ్యక్తిగత భద్రతాధికారి మృతి చెందారు. వీరి భౌతికకాయాలను పోలీసులు జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు.

కర్బి అగ్లాంగ్ జిల్లా స్వయంశాసిత రాష్ట్రం కావాలన్న ఆశయంతో పోరాడుతున్న కార్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ అనే ఉగ్రవాద సంస్థ దీనికి కారణమని అధికారులు వెల్లడించారు. కాగా, వీరిని అణచివేసేందుకు అసోం ఆపరేషన్ నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఎస్పీ మరణించారు.

  • Loading...

More Telugu News