: బాబు ప్రమాణ స్వీకారానికి మోడీ రావడం లేదు: ఏపీ బీజేపీ కార్యాలయం


గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఈ నెల 8న జరగనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యాలయం ప్రకటించింది. అయితే, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్, అనంతకుమార్, రవిశంకర్ ప్రసాద్ వస్తున్నారని తెలిపింది. అటు తమిళనాడు, గోవా, ఛత్తీస్ గఢ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారానికి వస్తున్నారని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చెప్పారు.

  • Loading...

More Telugu News