: గంజాయి సప్లయ్ లో వీడిదో స్టైల్
గాంధీ ఆసుపత్రి గంజాయికి అడ్డాగా మారింది. చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చే ఖైదీలకు గంజాయి సరఫరా చేస్తూ ఓ వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయాడు. జైళ్లలో ఉండే ఖైదీలు అనారోగ్యం పాలైతే వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసుల పర్యవేక్షణలో వైద్యమందిస్తారు. అలా వచ్చిన వారికి సయూమ్ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తుంటాడు. ఖైదీలకు ప్రత్యేక భద్రత ఉండడంతో వారిని కలిసేందుకు అనుమతి అవసరం.
అలా కాకుండా దొంగచాటుగా కలిస్తే వారిని పోలీసులు పట్టుకుని ప్రశ్నిస్తారు. సయూమ్ కూడా అలాగే దొరికిపోయాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న సయూమ్ ను పోలీసులు నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో అతని చెప్పుల్లో దాచిన 20 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.