: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్టు
వైయస్సార్ సీపీ నేత, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా అరెస్టయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా గుంటూరు బస్టాండ్ సెంటర్లోని దుకాణాలు అడ్డొచ్చే అవకాశం ఉందంటూ వాటిని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులను అడ్డుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే పోలీసులు ముస్తఫాను అరెస్టు చేశారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.