: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వండి: సీఎంను కోరిన టీయూడబ్ల్యూజే


జర్నలిస్టులకు నివాస స్థలాలు ఇవ్వాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. హైదరాబాదులోని సచివాలయంలో టీయూడబ్ల్యూజే ప్రతినిధులు కేసీఆర్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పనిచేసే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలివ్వాలని, గ్రామీణ విలేకరులు, డెస్కుల్లో పనిచేసేవారికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. వీటికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని జర్నలిస్టు ప్రతినిధులు తెలిపారు.

  • Loading...

More Telugu News