: అక్కడ కిలో మామిడిపళ్లు దొరకవు
గుజరాత్ లోని వడోదర జిల్లాలోని నర్మదా నది ఒడ్డునున్న షినోర్ గ్రామంలో కేజీ మామిడిపళ్లు కావాలంటే లేవు పొమ్మంటారు. మరీ తప్పదనుకుంటే సగం పండు కోసి ఇస్తారు. ఎందుకంటే, అక్కడ ఒక్కో మామిడి పండు రెండు కేజీల బరువు తూగుతుంది. ఇవేమీ విదేశీ రకాలు కాదు. జన్యుమార్పిడి అంతకంటే కాదు. అచ్చమైన స్వదేశీ రకాలు. సాధారణంగా మామిడి పండ్లలో రాజాపురి జాతి మామిడి పెద్దసైజులో ఉంటుంది. ఇక్కడి రైతు ఇక్బాల్ ఖోఖర్, శాస్త్రవేత్తలతో కలిసి శాస్త్రీయమైన పద్దతిలో మామిడి పండించాడు. అవి రాజాపురి కంటే నాలుగైదు రెట్లు పెద్దగా పండాయి. వీటిని ఛోటాఉదేపూర్ లో జరిగిన కృషి మహోత్సవ్ లో ప్రదర్శించారు.