: కేసీఆర్ పేషీలో తొలి అధికారిగా స్మితా సబర్వాల్
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ తన పేషీలో తొలి ఐఏఎస్ అధికారిని నియమించుకున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న స్మితా సబర్వాల్ ను అదనపు కార్యదర్శిగా నియమిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బదిలీ తక్షణమే అమల్లోకి వస్తుందని తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు.