: నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి!
ఈ వేసవి సీజన్ లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. భానుడి భగభగలకు వడగాల్పులు తోడవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో, రుతుపవనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలోకి ప్రవేశించాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. మరో రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వారు వెల్లడించారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని కూడా అధికారులు చెప్పారు.