: పాతికేళ్లలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఏకమవుతాయి : కట్జూ
వచ్చే 20, పాతికేళ్లలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఏకమవుతాయని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. తన ప్రసంగంలో ఎప్పుడూ ఘాటు వ్యాఖ్యలు చేసే కట్జూ ఇవాళ హైదాబాద్ లోనూ అదే పంథా కొనసాగించారు. ఇటీవలే దేశంలోని 90శాతం ప్రజలు ఫూల్స్ లా బిహేవ్ చేస్తున్నారని, కుల, మత ప్రాతిపదికగా ఓటేస్తున్నారని కట్జూ వ్యాఖ్యానించిన సంగతి మనకు తెలిసిందే.
కాగా, ఇవాళ సాలార్ జంగ్ మ్యూజియంలో 'ఉగ్రవాద వార్తలను అందివ్వడం - మీడియా పాత్ర' అనే అంశం మీద ఏర్పాటైన సదస్సులో పాల్గొని కట్జూ ప్రసంగించారు. పేదరికం, అసమానతలే ఉగ్రవాదానికి కారణమని కట్జూ అభిప్రాయపడ్డారు. అఖండ భారతావనిలో మతాల చిచ్చుపెట్టి బ్రిటీషర్లు పబ్బంగడుపుకున్నారని విమర్శించారు. ఫలితంగానే పాకిస్థాన్ అనే దొంగ దేశం అవతరించిందని కడ్జూ పేర్కొన్నారు. ఈ సదస్సును హిందూ దినపత్రిక, హెల్ప్ హైదరాబాద్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించాయి.