: లోక్ సభ స్పీకర్ గా సుమిత్రా మహాజన్ ఏకగ్రీవ ఎన్నిక


లోక్ సభ స్పీకర్ గా బీజేపీ సీనియర్ నేత సుమిత్రా మహాజన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆమె పేరును సభలో పలువురు సభ్యులు బలపర్చగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మహాజన్ ను స్పీకర్ సీటులోకి ప్రొటెం స్పీకర్ కమల్ నాథ్ ఆహ్వానించారు. ఆ వెంటనే ఆమె వచ్చి స్పీకర్ స్థానంలో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా సభలోని అభ్యర్థులందరికీ సుమిత్రా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు లోక్ సభ స్పీకర్ పదవిని చేపట్టిన వారిలో సుమిత్రా రెండో మహిళ కావడం గమనార్హం. ఈమెకు ముందు మీరాకుమార్ లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె మొత్తం 8 సార్లు లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు .

  • Loading...

More Telugu News