: కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై చర్యలు వేగవంతం: ద.మ రైల్వే జీఎం
కొత్త రైల్వే జోన్ ఏర్పాటు అంత ఈజీ కాదని... చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ తెలిపారు. అయినప్పటికీ కొత్త రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన చర్యలను వేగవంతం చేసిందని అన్నారు. ఈ రోజు ఆయన విజయవాడ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన తనిఖీలు చేపట్టారు.