: ఎవ్వరి మాటలు నమ్మకండి...మేము చెప్పిందే నిజం: ఈటెల


ప్రజలు ఎవరి మాటలూ నమ్మవద్దని, తాము చెప్పిందే నమ్మాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పంట రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. రుణాల వసూళ్ల కోసం అన్ని వివరాలతో సోమవారానికల్లా రావాలని బ్యాంకర్లకు సూచించామని ఆయన తెలిపారు.

బ్యాంకర్ల నుంచి సమాచారం వచ్చిన తరువాత, పంట రుణాల మాఫీపై జీవో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రా పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. రైతు రుణమాఫీని అడ్డం పెట్టుకుని తెలంగాణ రైతుల్లో ఆందోళనకు తెరతీస్తున్నారని ఈటెల విమర్శించారు.

  • Loading...

More Telugu News