: వేకువన విరుచుకుపడ్డ మిలిటెంట్లు...17 మంది పోలీసులు మృతి


ఆల్ ఖైదా తీవ్రవాదులు యెమన్ లో విరుచుకుపడ్డారు. బేహాన్ జిల్లా, షబ్వాన్ ప్రాంతంలోని పోలీస్ చెక్ పోస్టుపై మిలిటెంట్లు వేకువజామున అకస్మాత్తుగా దాడి చేశారు. దీంతో మూడు పోలీస్ వాహనాలు ధ్వంసం కాగా, 17 మంది పోలీసులు మృతి చెందారు. ఒక్కసారిగా మొదలైన కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు సుమారు గంటన్నర పాటు మిలిటెంట్లతో పోరాడారని ఉన్నతాధికారులు తెలిపారు. కొంత మంది పోలీసుల ఆచూకీ కనిపించడం లేదని చెప్పారు. ఆచూకీ కనిపించని వారికోసం వెతుకుతున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News