: బస్టాపు విషయంలో వాగ్వాదం కండక్టర్ ప్రాణం తీసింది


నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడ వద్ద విధులు ముగించుకుని ఇంటికెళ్తున్న ఆర్టీసీ ఉద్యోగి ఐఎస్ రెడ్డి(కండక్టర్) పామూరుకు వెళ్తున్న బస్సు ఎక్కాడు. అదే బస్సులో ప్రయాణిస్తున్న కొంత మంది, 'జడదేవి బస్టాప్ లో బస్సు ఆగుతుందా?' అని అడిగారు. అక్కడ బస్టాప్ లేదని రెడ్డి సమాధానమిచ్చాడు. ఇంతలో బ్రహ్మయ్య అనే ప్రయాణికుడు కలుగజేసుకుని, 'నీకేం తెలుసు...అక్కడ బస్సు కచ్చితంగా ఆగుతుంది' అన్నాడు.

దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఆవేశానికి లోనైన బ్రహ్మయ్య, రెడ్డిని ఒక్కసారిగా బస్సులోంచి నెట్టాడు. దీంతో నడుస్తున్న బస్సులోంచి బయటకు పడిపోయిన రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, బ్రహ్మయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News