: ఒప్పుకోలేదని... తలలు నరికాడు!


వివాహేతర సంబంధానికి నిరాకరించారని తల్లీకూతుళ్లను నిర్ధాక్షిణ్యంగా నరికి చంపేశాడో కిరాతకుడు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లిలో చంద్రమ్మ నివాసం ఉంటోంది. ఆమె కుమార్తె చిన్ని భర్త చనిపోవడంతో గత కొంత కాలంగా తల్లి దగ్గరే ఉంటోంది. చిన్నిపై అదే గ్రామానికి చెందిన అరటికాయల వ్యాపారి శివయ్య మనసుపడ్డాడు. తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని మూడు నెలలుగా ఆమెపై ఒత్తిడి తెస్తున్నాడు.

ఈ రోజు తెల్లవారుజామున చంద్రమ్మ ఇంటికి వచ్చిన శివయ్య చిన్నిపై అత్యాచారానికి యత్నించాడు. అతని ప్రయత్నాన్ని తల్లీకూతుళ్లు అడ్డుకోవడంతో తనవెంట తెచ్చుకున్న వేట కొడవలితో చిన్నిని, చంద్రమ్మను నరికి చంపాడు. తరువాత వారిద్దరి శరీరాల నుంచి తలలను వేరు చేసి మెడలో వేసుకుని కాసేపు తిరిగి, రోడ్డుమీద పారేసి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు శివయ్య కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News