: తెలంగాణ బాధ్యతలను షర్మిల తిరస్కరించారనడం అవాస్తవం: వైకాపా


సార్వత్రిక ఎన్నికల తర్వాత అడ్రస్ లేకుండా పోయిన వైఎస్సార్సీపీ నాయకురాలు, జగన్ సోదరి షర్మిలపై ఆ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో పార్టీ బాధ్యతలను షర్మిల తిరస్కరించారనే వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం ఎలాంటి బాధ్యతలు స్వీకరించడానికైనా షర్మిల సిద్ధంగా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్సీపీ ఎన్నటికీ కలవదని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం పేరుతో చంద్రబాబు కోట్లాది రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News