: వనపర్తిలో కలపకండి: సీఎస్ ను కోరిన రేవంత్
కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిశారు. తన నియోజకవర్గమైన కొడంగల్ ను కొత్తగా ఏర్పాటు కానున్న వనపర్తి జిల్లాలో కలపాలనుకుంటున్నారని... ఇది తమకు సమ్మతం కాదని తెలిపారు. మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ లో ఉన్న కొడంగల్ ను మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంచాలని విజ్ఞప్తి చేశారు.