: స్పీకర్ గా సుమిత్రా మహాజన్ పేరును ప్రతిపాదించిన మోడీ


లోక్ సభ స్పీకర్ గా సుమిత్రా మహాజన్ పేరును ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. ప్రధాని నరేంద్ర మోడీ సహా 11 మంది సభ్యులు సుమిత్రా మహాజన్ పేరును ప్రతిపాదించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన సుమిత్రా మహాజన్ సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో ఆమె కేంద్ర మంత్రిగా పని చేశారు. సింప్లిసిటీని అమితంగా ఇష్టపడే సుమిత్రా మహాజన్ ఇండోర్ యూనివర్సిటీ నుంచి ఎమ్.ఏ ఎల్ఎల్ బీ పట్టభద్రురాలు. ఆమెను స్థానికులు 'అక్కా' (దీదీ) అంటూ సంబోధిస్తారు.

  • Loading...

More Telugu News