: ఒక్కో ఎంపీ స్థానాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయండి: రేవంత్ రెడ్డి


తెలంగాణలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 24కు పెంచడానికి రంగం సిద్ధమైంది. జిల్లాల సంఖ్యను పెంచుతామని నిన్న కూడా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు జిల్లాలను ఏర్పాటు చేస్తే పాలనాపరమైన సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఒక్కో ఎంపీ స్థానాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ విధంగా 17 పార్లమెంటు స్థానాలను 17 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఇష్టం వచ్చినట్టు జిల్లాలను ఏర్పాటు చేస్తే... ప్రతీ ఎంపీ ఇద్దరేసి కలెక్టర్లు, ఇద్దరేసి ఎస్పీల చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా లేవనెత్తుతానని చెప్పారు.

  • Loading...

More Telugu News